గొలుసు దొంగల ముఠా అరెస్టు

ఒంటరిగా వెళుతున్న వృద్ధుల మెడలోంచి బంగారు ఆభరణాలు దోచుకునే దొంగల ముఠాను వనపర్తి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 10 తులాల బంగారు, 45 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసాచారి వివరాల ప్రకారం..

Updated : 04 Oct 2022 04:10 IST

10 తులాల బంగారు, 45 తులాల వెండి ఆభరణాల స్వాధీనం

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు,

బంగారు, వెండి ఆభరణాలు

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : ఒంటరిగా వెళుతున్న వృద్ధుల మెడలోంచి బంగారు ఆభరణాలు దోచుకునే దొంగల ముఠాను వనపర్తి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 10 తులాల బంగారు, 45 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసాచారి వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామానికి చెందిన చీర్ల ఈశ్వరయ్య చోరీ కేసులతో పాటు పీడీ యాక్ట్‌పై జైలు శిక్ష అనుభవించి ఏప్రిల్‌లో విడుదలయ్యాడు. ఈయన తన భార్య రాధ, హైదరాబాదులోని జగద్గిర్‌గుట్టకు చెందిన వేణు ఆలియాస్‌ అఖిల్‌ ఓ ముఠాగా ఏర్పడి గొలుసు చోరీలకు పాల్పడ్డారు. శ్రీరంగాపూర్‌ మండల కేంద్రంలో ఆగస్టు 8న ఒంటరిగా వెళుతున్న వృద్ధురాలి మెడలోని బంగారు ఆభరణాలను దోచుకున్నారు. సెప్టెంబరు 14న పెద్దమందడి మండల కేంద్రంలో వృద్ధురాలు నడుచుకుంటూ వెళుతుండగా ఆమెతో రాధ మాట్లాడుతుండగా ఈశ్వరయ్య, వేణు ఆభరణాలను లాక్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ సీఐ శ్రీనివాసాచారి, ఎస్సైలు హృషికేష్‌, అంజద్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు తిరుపతిరెడ్డి, శ్రీనివాసులు, గోవింద, సిబ్బంది సమరసింహారెడ్డి, మురళి నిందితుల కోసం వేట సాగించారు. హైదరాబాదులో ఉంటున్నట్లు తెలుసుకుని ఈశ్వరయ్య, వేణును చాకచక్యంగా పట్టుకున్నారు. విచారణలో పెద్దమందడి, శ్రీరంగాపూర్‌, మరికల్‌, పెంట్లవెళ్లి, కోడేరు, ముసాపేట, బొంరాస్‌పేట, హైదరాబాదులోని పహాడీషరీఫ్‌ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. వీరి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, 45 తులాల వెండి ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సోమవారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని