బ్యాంకులో నకిలీ బంగారం తనఖా

తనఖాకు వచ్చే బంగారు నగలకు విలువ కట్టే గోల్డ్‌ అప్రైజర్‌ తాను పనిచేస్తున్న బ్యాంకుకు రూ.2.45 కోట్లకు టోకరా వేసిన ఘరానా మోసం కాకినాడలో వెలుగుచూసింది.

Updated : 31 Jan 2023 09:40 IST

రూ.2.45 కోట్లకు టోకరా

కాకినాడ(మసీదుసెంటర్‌), న్యూస్‌టుడే: తనఖాకు వచ్చే బంగారు నగలకు విలువ కట్టే గోల్డ్‌ అప్రైజర్‌ తాను పనిచేస్తున్న బ్యాంకుకు రూ.2.45 కోట్లకు టోకరా వేసిన ఘరానా మోసం కాకినాడలో వెలుగుచూసింది. కాకినాడ యూకో బ్యాంక్‌లో గోల్డ్‌ అప్రైజర్‌గా పని చేస్తున్న స్థానిక రామకృష్ణారావుపేటకు చెందిన తాడోజు శ్రీనివాసరావు 8.316 కిలోల నకిలీ బంగారు నగలు తనఖా పెట్టి రూ.2,45,84,000 మొత్తాన్ని రుణాలుగా తీసుకున్నాడు. ఈ రుణాలను 15 నెలలుగా 60 దఫాల్లో 30 మంది పేర్లపై పొందినట్లు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన తాడోజు శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరిని కాకినాడ రెండో పట్టణ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ పి.శ్రీనివాస్‌ సోమవారం విలేకరులకు వెల్లడించారు. ప్రధాన నిందితుడితో పాటు కొందరు ఖాతాదారులపై బ్యాంక్‌ జోనల్‌ మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 6న కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితునికి సహకరించిన బంధువులు కొత్తల రాంబాబు, కొండేపూడి కొండరాజునూ అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు