అమరరాజాలో అగ్ని ప్రమాద నష్టం రూ.550 కోట్లు

చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్దానపల్లిలోని అమరరాజా గ్రోత్‌ కారిడార్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.550 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు సంస్థ ప్రతినిధులు లెక్కగట్టారు.

Updated : 03 Feb 2023 06:33 IST

యాదమరి, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్దానపల్లిలోని అమరరాజా గ్రోత్‌ కారిడార్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.550 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు సంస్థ ప్రతినిధులు లెక్కగట్టారు. ఈ మేరకు బంగారుపాళ్యం పోలీస్‌స్టేషన్‌లో సంస్థ ప్రతినిధి సి.గోవిందనాయుడు ఫిర్యాదు చేయగా పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. జనవరి 30న పరిశ్రమలోని ట్యూబులర్‌ బ్యాటరీ తయారీ విభాగంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా రాజుకున్న మంటలు ప్లాంటు మొత్తం వ్యాపించాయి. మూడు అగ్నిమాపక శకటాలతో రాత్రంతా శ్రమించగా మరుసటి రోజు ఉదయం మంటలు అదుపులోకి వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు