పదేళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు

తమ ట్రస్టులో సభ్యత్వం తీసుకుంటే పింఛన్‌ ఇస్తామని మోసం చేసి, పదేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని తెలంగాణ సీఐడీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

Published : 30 Mar 2023 04:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: తమ ట్రస్టులో సభ్యత్వం తీసుకుంటే పింఛన్‌ ఇస్తామని మోసం చేసి, పదేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని తెలంగాణ సీఐడీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నాంపల్లిలోని ఆరో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచారు. ఏపీలోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన వలపపురం చిన్నయ్య అలియాస్‌ పౌల్‌ మరికొందరితో కలిసి లిటిల్‌ లింబ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ మినిస్టర్స్‌ (ఎల్‌.ఎల్‌.బి.సి.ఎం.) పేరిట ఓ ట్రస్టును స్థాపించాడు. రూ.10,500 చెల్లించి ఇందులో సభ్యత్వం తీసుకుంటే ప్రతినెలా రూ.2,500 పింఛన్‌ ఇస్తామని నమ్మించాడు. ఇలా మొత్తం రూ.6 కోట్లు వసూలు చేశాడు. కొద్ది రోజులు పింఛన్‌ చెల్లించాక చేతులెత్తేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా చిన్నయ్యపై తెలంగాణలో 14 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పసర ఠాణాలో నమోదైన కేసులో భాగంగా అక్కడి పోలీసులు 2012లో అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై వచ్చిన చిన్నయ్య పరారయ్యాడు. ఈ కేసులకు సంబంధించి మరో ఆరుగురు పరారీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని