నర్సుల వైద్యం.. శిశువు మృతి

డెలివరీ సమయంలో గర్భిణికి నర్సులు వైద్యం చేయడంతో శిశువు మృతిచెందిన ఘటన మంగళవారం పట్టణంలోని సామాజిక వైద్యశాలలో చోటుచేసుకుంది.

Published : 31 May 2023 04:58 IST

కోదాడ, న్యూస్‌టుడే: డెలివరీ సమయంలో గర్భిణికి నర్సులు వైద్యం చేయడంతో శిశువు మృతిచెందిన ఘటన మంగళవారం పట్టణంలోని సామాజిక వైద్యశాలలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వెంకట్రామపురం గ్రామానికి చెందిన మానస పురిటి నొప్పులతో సోమవారం ఆసుపత్రిలో చేరారు. అర్ధరాత్రి నొప్పులు వచ్చాయి. వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో నర్సులు ఇంజక్షన్‌ ఇచ్చారు. అది  వికటించడంతో పుట్టిన శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్సుకు సమాచారమిస్తే ప్రైవేటు ఆస్పత్రికి తాము తీసుకెళ్లబోమని చెప్పారు. బయటకు వెళ్లి మరో వాహనం కోసం వెతికేలోగా శిశువు మృతి చెందాడని బాధితులు పేర్కొన్నారు. ఆసుపత్రిలో గైనకాలజిస్టు లేకపోవడంతో శిశువు మరణించిందని, సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నరసింహను వివరణ కోరగా శిశువుకు అనారోగ్యం ఉన్నట్లు హుజూర్‌నగర్‌ నుంచి వచ్చిన వైద్యులు నిర్ధారించారని తెలిపారు. ఆస్పత్రిలో వైద్యురాలు లేకపోయినా ఆమె సూచనలతోనే నర్సులు వైద్యం చేశారని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని