టాయిలెట్‌లో బాంబు పేలుడు.. పశ్చిమబెంగాల్‌లో బాలుడి మృతి

పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో సోమవారం బాంబు పేలుడు కలకలం సృష్టించింది. బాన్‌గావ్‌ టౌన్‌ పరిధిలోని బక్షిపల్లి ప్రాంతంలోని సైకిల్‌ గ్యారేజీలో పనిచేసే 11 ఏళ్ల బాలుడు రాజు రాయ్‌ మరుగుదొడ్లలో పేలుడు సంభవించడంతో ప్రాణాలు కోల్పోయాడు.

Published : 06 Jun 2023 04:53 IST

అక్కడే మరో 8 గ్రనేడ్లు

శ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో సోమవారం బాంబు పేలుడు కలకలం సృష్టించింది. బాన్‌గావ్‌ టౌన్‌ పరిధిలోని బక్షిపల్లి ప్రాంతంలోని సైకిల్‌ గ్యారేజీలో పనిచేసే 11 ఏళ్ల బాలుడు రాజు రాయ్‌ మరుగుదొడ్లలో పేలుడు సంభవించడంతో ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో రాజు.. ప్రజా మరుగుదొడ్లలోకి వెళుతుండగా అకస్మాత్తుగా బాంబు పేలింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద శబ్దం విన్న బాలుడి తండ్రి ప్రశాంత్‌ రాయ్‌.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న తనయుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు నిర్వీర్యక దళం.. ఆ మరుగుదొడ్ల నుంచి మరో 8 గ్రనేడ్లను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, అక్కడ ఆరు బాంబులు పేలినట్లు బన్‌గావ్‌ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ గోపాల్‌ సేథ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని