Vizag: విశాఖ జిల్లాలో అదృశ్యమైన ఐదేళ్ల బాలుడి మృతి

విశాఖ జిల్లాలో గురువారం రాత్రి అదృశ్యమైన ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు.

Updated : 09 Jun 2023 12:33 IST

విశాఖ : విశాఖ జిల్లాలో గురువారం రాత్రి అదృశ్యమైన ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురం శివార్లలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మండంలోని ఎస్‌ఆర్‌పురం గ్రామానికి చెందిన కనకరాజు,  నారాయణమ్మ దంపతుల కుమారుడు  తేజ(5) గురువారం రాత్రి 7 గంటల నుంచి కన్పించకుండా పోయాడు. కుటుంబసభ్యులు, గ్రామస్థులు చుట్టుపక్కల ప్రాంతంలో వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం గ్రామ  శివారులో బాలుడి మృతదేహాన్ని గుర్తించిన  గ్రామస్థులు పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని