శ్రీశైలంలో 25 మంది భక్తులకు అస్వస్థత

ప్రముఖ శైవక్షేత్రం శ్రీభ్రమరాంబ-మల్లికార్జునస్వామివార్లను దర్శించుకునేందుకు అనంతపురం జిల్లా నుంచి శ్రీశైలం వచ్చిన 25 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని సున్నిపెంట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా

Updated : 04 Mar 2021 11:53 IST

సున్నిపెంట సర్కిల్‌: ప్రముఖ శైవక్షేత్రం శ్రీభ్రమరాంబ-మల్లికార్జునస్వామివార్లను దర్శించుకునేందుకు అనంతపురం జిల్లా నుంచి శ్రీశైలం వచ్చిన 25 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని సున్నిపెంట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం నెరజాం గ్రామానికి చెందిన 120 మంది భక్తులు బుధవారం మధ్యాహ్నం శ్రీశైలానికి వచ్చారు. దర్శనం అనంతరం రాత్రిపూట తాము తీసుకొచ్చిన ఆహారాన్ని తిని పడుకున్నారు. ఈ క్రమంలో వారిలో 25 మంది భక్తులకు కడుపునొప్పితో కూడిన విరేచనాలు, వాంతులు అయ్యాయి. దీంతో వెంటనే వారిని 108 వాహనంలో సున్నిపెంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులకు ఆరోగ్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్‌ ఆనంద్‌రాం తెలిపారు. 


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని