Crime News: వివాహితపై ఇన్‌స్పెక్టర్‌ అత్యాచారం.. రిమాండ్‌ రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు

వివాహిత కణతపై తుపాకి గురిపెట్టి అత్యాచారం చేసిన మాజీ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరావు కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కీలక...

Updated : 13 Jul 2022 19:17 IST

హైదరాబాద్‌: టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావుకు కీలకమైన కేసులను ఛేదించగలిగే అధికారిగా పేరుంది.. ఉత్తరమండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఏడేళ్లు పనిచేసిన ఆయన ఎన్నో కీలకమైన కేసులు పరిష్కరించారు. ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను గుర్తించారు.. మాదకద్రవ్యాల స్మగ్లర్లనూ పట్టుకున్నారు. పరారీలో ఉన్న ఎంతోమంది కరడుగట్టిన నేరగాళ్లను పట్టుకొచ్చిన నాగేశ్వరరావు ఇప్పుడు అత్యాచారం కేసులో కటకటాల పాలయ్యారు. వివాహిత కణతపై తుపాకి గురిపెట్టి అత్యాచారం చేసిన మాజీ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరావు కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. అత్యాచారం, అపహరణ, హత్యాయత్నం, ఆయుధ నిరోధక చట్టం కింద ఆయనపై వనస్థలిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె వాంగ్మూలం రికార్డు చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిన గదిలో వెంట్రుకలు, దుప్పటి, గాజులు క్లూస్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుంది. నాగేశ్వరరావును బాధితురాలి భర్త కొట్టిన కర్ర, అత్యాచార సమయంలో బాధితురాలి దుస్తులు స్వాధీనం చేసుకుని వాటిని ఎఫ్ఎస్‌ఎల్‌కి పంపించినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు, ఆమె భర్తను కారులో తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి పరిశీలించారు. 

బాధితురాలి ఇంటి సమీపంలో ఉన్న ఎలక్ట్రిక్‌ షాపులోని సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ఇబ్రహీంపట్నం మార్గంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నాగేశ్వరరావు కారు వెళ్లినట్టు రికార్డయింది. దీంతో సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు వాడిన కారును, బాధితురాలి సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశారు. ఘటన జరిగిన తర్వాత బాధితురాలిని, అమె భర్తను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు.. తాను ఆక్టోపస్‌ అధికారినని, కానిస్టేబుల్‌తో కలిసి వెళ్తుండగా కారు ప్రమాదం జరిగిందని నాగేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చాడు. కారు ప్రమాదంపై అతని వద్ద పనిచేసే హోం గార్డుకు సమాచారం ఇవ్వడంతో అతను ట్రోయింగ్‌ వాహనం ద్వారా కారును చంపాపేట్‌కు తరలించాడు. హోంగార్డ్‌ ప్రవీణ్‌ స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేశారు.

అత్యాచారం ఘటన తర్వాత నాగేశ్వరరావు తన బట్టలు స్వయంగా ఉతుక్కున్నాడని, ఏమీ తెలియనట్టు మారేడ్‌పల్లి పీఎస్‌కు వెళ్లి విధులు నిర్వహించినట్ట పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని మారేడ్‌పల్లి ఠాణాలోనే రివాల్వర్‌ ఉంచి బెంగళూరుకు పరారయ్యాడు. కొత్తపేటలోని గ్రీన్‌ హిల్స్‌ కాలనీలో అతని నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు... అత్యాచార సమయంలో వాడిన ప్యాంటు, షర్టు, లోదుస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 10న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, కొవిడ్‌, లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించిన అనంతరం హయత్‌నగర్‌ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని