పోలీసు కస్టడీలో జేసీ ప్రభాకర్‌రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. తాడిపత్రికి సమీపంలోని జమ్ములదిన్నెలో సీఐ దేవేందర్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి ..

Published : 16 Aug 2020 12:51 IST

అనంత నేరవార్తలు: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. తాడిపత్రికి సమీపంలోని జమ్ములదిన్నెలో సీఐ దేవేందర్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి దూర్భాషలాడారనే ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

ఈ కేసులో కడప జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రభాకర్‌రెడ్డిని ఆదివారం ఉదయం పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన  అనంతరం మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు... ప్రభాకర్‌రెడ్డిని విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు కడప జైలుకు తరలించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని