
Kangana Ranaut: అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు.. నా మూడ్ ఇలా ఉంటుంది
చేతిలో గాజు గ్లాస్, బోల్డ్ డ్రెస్‌తో వివాదస్పద వ్యాఖ్యలు
ముంబయి: గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాలకు ప్రారంభం నుంచే మద్దతు పలుకుతూ వచ్చింది నటి కంగనా రనౌత్. రైతుల సంక్షేమార్థం మళ్లీ ఆ బిల్లులను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో ఈ విషయంపై ఘాటుగా స్పందించింది కంగనా. రైతు ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా అభివర్ణిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసింది.దీనిపై కంగనపై ముంబయి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.దీనికి కౌంటర్‌గా మరోసారి బోల్డ్ఫొటోతో స్పందించారామె. ‘‘మరో రోజు.. మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాళ్లు నన్ను అరెస్టు చేయడానికి నా రూమ్‌కి వచ్చినప్పుడు నా మూడ్ ఇలా ఉంది’’ అంటూ పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి ఇంటికొచ్చి చూస్తే ఇక్కడ పార్టీ మూడ్ ఉంటుందని.. చేతిలో గ్లాస్, బోల్డ్ డ్రెస్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈపోస్ట్ సోషల్ మీడియాలో వివాదస్పదంగా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.