Crime news: భార్య చీర సరిగా కట్టుకోలేదంటూ భర్త ఆత్మహత్య!

తాను కట్టుకున్న భార్య సరిగా చీర కట్టుకోవడం రాదని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ ఘటన......

Published : 18 May 2022 01:49 IST

ఔరంగాబాద్‌: తాను కట్టుకున్న భార్య సరిగా చీర కట్టుకోలేక పోతోందని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సామధాన్‌ సాబ్లే (24) అనే వ్యక్తి ఔరంగాబాద్‌లోని ముకుంద్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తన భార్య పట్ల అసంతృప్తిగా ఉన్న అతడు ఇంట్లోనే సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ముకుంద్వాడీ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు వెల్లడించారు. ‘‘అతడి గదిలో సూసైడ్‌ లెటర్‌ స్వాధీనం చేసుకున్నాం. తన భార్య సరిగా చీర కట్టుకోలేకపోతోందని, అలాగే, సరిగ్గా నడవడం/ మాట్లాడటం లేదు’’ అని ఆ లేఖలో పేర్కొన్నట్టు పోలీసులు వివరించారు. సాబ్లే ఆరు నెలల క్రితమే వయస్సులో తనకంటే ఆరేళ్లు పెద్దదైన మహిళను వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు