Crime news: యువతిని రేప్‌ చేసి.. ఆ వీడియో సోషల్‌ మీడియాలో పెట్టి..!

ఓ యువతిపై జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. 18 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించిన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన నిందితుడిని  పోలీసులు అరెస్టు చేశారు. .......

Published : 30 Jan 2022 01:42 IST

పంజాబ్‌లో ఓ యువకుడి అరెస్టు

హోషియార్పూర్‌‌: పంజాబ్‌లో ఓ యువతిపై జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. 18 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించిన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన నిందితుడిని  పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్‌లోని హోషియార్పూర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో కొన్ని నెలల క్రితం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. సోషల్‌ మీడియాలో  యువతితో స్నేహం ఏర్పరచుకున్న 22 ఏళ్ల విశాల్‌ చౌధరి అనే యువకుడు.. ఏదో సాకుచెప్పి ఆమెను తన ఇంటికి పిలిచి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు వివరించారు. చబ్బేవాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుందన్నారు. గతేడాది ఆమెను తన ఇంటికి పిలిచిన విశాల్‌ చౌధరి (22ఏళ్లు) ఆమెకు మత్తుమందు కలిపిన శీతలపానియం ఇచ్చాడనీ.. యువతి స్పహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేసి వీడియో రికార్డు చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత ఆమెను తరచూ బ్లాక్‌మెయిల్‌ చేసి వీడియో వైరల్‌ చేస్తానంటూ బెదిరించేవాడన్నారు. ఇటీవల అతడి కోరికను యువతి నిరాకరించడంతో వీడియోను సోషల్‌మీడియాలో సర్క్యులేట్‌ చేసి వైరల్‌  చేశాడని తెలిపారు. దీంతో తమకు అందిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్టు చెప్పారు.

హోటల్‌లో యువతిపై సామూహిక అత్యాచారం

గ్వాలియర్‌: మధ్యప్రదేశ్‌లో మరో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇద్దరు వ్యక్తులు గ్వాలియర్‌లోని ఓ హోటల్‌లో యువతిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. బుధవారం రాత్రి యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ లైంగిక దాడి జరిగినట్టు గ్వాలియర్‌ డీఎస్పీ విజయ్‌ సింగ్‌ భదౌరియా తెలిపారు. భోపాల్‌కు చెందిన యువతి (22 ఏళ్లు) తన ఫ్రెండ్‌తో కలిసి గ్వాలియర్‌లోని ఓ హోటల్‌కు పార్టీకి వెళ్లిందన్నారు. పార్టీ అయిపోయిన తర్వాత ఆమెపై ఇద్దరు వ్యక్తులుదాడి చేసి హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు