Telangana News: అధికారులపై పెట్రోల్‌ పిచికారీ చేసిన యువకుడు..

తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలంలోని తుంగూరులో అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డాడు.

Updated : 10 May 2022 17:01 IST

బీర్పూర్: తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలంలోని తుంగూరులో అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డాడు. దారి వివాదం దృష్ట్యా గ్రామానికి వచ్చిన అధికారులపై పెట్రోల్‌తో పిచికారీ చేశాడు. ఈ క్రమంలో నిప్పంటుకోవడంతో ఓ అధికారికి గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. దారి వివాదమై అదే గ్రామానికి చెందిన యువకుడు గంగాధర్‌ రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టాడు. దీనిపై కొంతమంది స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించి కర్రలు తొలగించేందుకు ఎస్‌ఐ, తహసీల్దార్‌, ఎంపీవో గ్రామానికి వెళ్లారు. అధికారులు రావటాన్ని గమనించిన గంగాధర్‌ వారిపై పెట్రోల్‌ చల్లాడు. ఈ క్రమంలో ఎస్సై ప్రతిఘటించి అడ్డుకునేందుకు యత్నించారు. అదే సమయంలో గంగాధర్‌ నిప్పంటించాడు. పక్కనే ఉన్న ఎంపీవో రామకృష్ణరాజుకు మంటలు అంటుకోవడంతో ఆయన పరుగులు పెట్టారు. అనంతరం ఆయనపై నీళ్లు చల్లి మంటలు ఆర్పివేసి కాపాడారు. ఆ తర్వాత ఎంపీవోను చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన గంగాధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని