
Crime news: భర్త మరణవార్త విని.. పసిబిడ్డను చంపి, ఆత్మహత్య చేసుకున్న భార్య
బెంగళూరు: కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మృతిచెందాడన్న బాధతో ఆరు నెలల కుమారుడిని చంపిన ఓ మహిళ.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది. రాయ్‌చూర్‌కు చెందిన గంగాధర్ బి కమ్మర(36), శ్రుతి(30) భార్యాభర్తలు. వీరికి ఆరు నెలల కుమారుడు అభిరామ్ ఉన్నాడు. మంగళూరులోని అగ్నిమాపక దళంలో గంగాధర్ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గంగాధర్ మరణించాడు. కుంటికాన సమీపంలో రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుంచి కుందాపుర్ వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
భర్త మృతిచెందిన విషయం రాయచూర్‌లో ఉన్న భార్య శ్రుతికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె.. భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఆ రాత్రి 10 గంటల సమయంలో తన ఆరు నెలల కుమారుడు అభిరామ్‌ను హత్యచేసి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు ఘటనలతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మంగళూరు సిటీ పోలీసు కమిషనర్ ఎన్ శశికుమార్ వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (24-06-2022)
-
World News
Ukraine Crisis: ఇటు బ్రిక్స్ సహకారానికి పుతిన్ పిలుపు.. అటు ఇజ్రాయెల్‌పై జెలెన్స్కీ గరం గరం!
-
India News
Maharashtra Crisis: రెబల్ ఎమ్మెల్యేల కోసం 7 రోజులకు 70 రూమ్‌లు.. రోజుకు ఎంత ఖర్చో తెలుసా!
-
Business News
Indian Media: ₹4.30 లక్షల కోట్లు.. 2026 నాటికి భారత మీడియా, వినోద రంగం వాటా
-
Sports News
Team India: టీమ్ఇండియా మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
-
Crime News
Crime News: మిత్రుడి భార్యపై అత్యాచారం... తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసు... గుట్టువీడిన సుబ్బారావు పాత్ర
- చిత్తూరు మాజీ మేయర్ హేమలతపైకి పోలీసు జీపు!
- Maharashtra Crisis: రెబల్ ఎమ్మెల్యేల కోసం 7 రోజులకు 70 రూమ్‌లు.. రోజుకు ఎంత ఖర్చో తెలుసా!
- Crime News: మిత్రుడి భార్యపై అత్యాచారం... తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
- Team India: టీమ్ఇండియా మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
- Maharashtra Crisis: రౌత్ అందుకే అలా అన్నారు.. మెజార్టీ ఎవరిదో అసెంబ్లీలో తేలుతుంది: శరద్ పవార్
- భరత్ ఒక్కడే
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Health: చిన్నారుల అత్యవసర పరిస్థితులపై పెద్దలు ఓ కన్నేయండి..!
- Maharashtra Crisis: ఉద్ధవ్ ఠాక్రే విషయంలో కంగనా చెప్పిందే జరిగిందా?.. వైరల్ అవుతున్న వీడియో!