Andhra News: హైదరాబాద్‌ వెళ్తున్న బస్సుకు నిప్పుపెట్టిన మావోయిస్టులు

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని కొత్తూరు వద్ద ఆదివారం రాత్రి మావోయిస్టులు బస్సుకు నిప్పుపెట్టారు.

Updated : 25 Apr 2022 09:58 IST

చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని కొత్తూరు వద్ద ఆదివారం రాత్రి మావోయిస్టులు బస్సుకు నిప్పుపెట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సును మావోయిస్టులు ఆపి ప్రయాణికులను కిందికి దింపారు. అనంతరం దానికి నిప్పుపెట్టి అక్కడినుంచి వెళ్లిపోయారు. మావోయిస్టు నేత నర్మద క్యాన్సర్‌తో బాధపడుతూ మంబయిలోని ఓ ఆస్ప్రతిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో మావోయిస్టులు దండకారణ్యం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నే  ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.

మావోయిస్టు నర్మద స్వస్థలం కృష్ణా జిల్లా. అల్లూరి ఉషారాణి అలియాస్‌ నర్మద 1980లో మద్రాస్‌ యూనివర్సిటీలో ఎంఏ చేశారు. అనంతరం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లారు. 42ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో ఉన్నారు. 2019లో క్యాన్సర్‌ చికిత్స కోసం హైదరాబాద్‌ వచ్చిన నర్మదను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు