Crime News: హైదరాబాద్‌లో మరో అఘాయిత్యం.. కార్ఖానా పోలీసులు ఏమన్నారంటే..

జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే సికింద్రాబాద్‌ పరిధిలో మైనర్‌పై సామూహిక అత్యచార ఘటన ఆలస్యంగా

Updated : 07 Jun 2022 13:05 IST

సికింద్రాబాద్‌: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే సికింద్రాబాద్‌ పరిధి కార్ఖానాలో ఓ మైనర్‌పై ఐదుగురు అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాలికపై గ్యాంగ్‌రేప్‌ జరిగినట్లు వార్తలు రాగా పోలీసులు దాన్ని ఖండించారు. తమకందిన ఫిర్యాదు మేరకు ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో మైనర్లు మినహా మిగతా వారిపై పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. బాలికతో నిందితులు ధీరజ్‌, రితేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నారు. అనంతరం ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లోబర్చుకున్నారు. అత్యాచారం చేసే సమయంలో వారిద్దరూ వీడియోలు తీసి బాలికను భయపెట్టారు. వీడియోలు ఇస్తానని చెప్పి పిలిచి  స్నేహితులతో కలిసి దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దాదాపు రెండు నెలల క్రితం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక పరిస్థితి చూసి ఆమె కుటుంబసభ్యులు మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడి వద్ద బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మే 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరగలేదు: పోలీసులు
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ‘‘స్నేహం పేరుతో బాలికను మభ్యపెట్టిన నిందితులు.. లైంగిక వాంఛ తీర్చుకున్నారు. బాలికపై లాడ్జిలో వేర్వేరు రోజుల్లో లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో గత నెల 30న వారిపై కేసు నమోదు చేశాం. బాలికపై సామూహిక అత్యాచారం జరగలేదు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు, ముగ్గురు యువకులు ఉన్నారు’’ అని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని