Andhra News: ప్రకాశం జిల్లాలో సైకో వీరంగం.. అన్నదమ్ములపై గొడ్డలితో దాడి

ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం ఎడవల్లిలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. గ్రామంలో ఇద్దరిపై గొడ్డలితో దాడి చేశాడు.

Updated : 07 Oct 2022 11:05 IST

పెద్దదోర్నాల: ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం ఎడవల్లిలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. గ్రామంలో ఇద్దరిపై గొడ్డలితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఎడవల్లికి చెందిన బత్తుల శ్రీనివాసులు కొంతకాలంగా మూగజీవాలు, వ్యక్తులపై దాడి చేస్తూ సైకోలా ప్రవర్తిస్తున్నాడు.

ఈ ఉదయం అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు రమణయ్య, వెంకట నారాయణలపై గొడ్డలితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్సనిమిత్తం దోర్నాల సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. సైకోపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుల కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts