Hayathnagar: రాజేష్‌ శరీరంపై ఎలాంటి గాయాల్లేవు.. వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ

హయత్‌నగర్‌లో సంచలనం రేకెత్తించిన రాజేష్‌(25), టీచర్‌ (45) ఆత్మహత్య కేసు వివరాలను రాచకొండ సీపీ మీడియాకు వెల్లడించారు. ఈ కేసుపై ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Updated : 01 Jun 2023 16:55 IST

హయత్‌నగర్‌: సంచలనం రేకెత్తించిన ఉపాధ్యాయురాలు (45), రాజేష్‌ (25) మృతికి సంబంధించి రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ వివరాలు వెల్లడించారు. వీరిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. రాజేష్‌ పోస్టు మార్టం నివేదికలో ఎలాంటి గాయాలు లేవని తేలిందని చెప్పారు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయంపై ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. 

టీచర్‌ కుమారుడికి రాజేష్ విషయం తెలిసిందిని దర్యాప్తులో తేలిందని డీఎస్‌ చౌహాన్‌ వివరించారు. అతడు ఓసారి రాజేష్ పైన దాడి కూడా చేశాడని చెప్పారు. రాజేష్ ప్రతి రోజు ఉపాధ్యాయురాలు ఇంటి చుట్టూ తిరిగేవాడని దర్యాప్తులో వెల్లడి అయ్యిందన్నారు. టీచర్‌ మొదటిగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు. తన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని ఆమె కుమారుడు రాజేష్‌కి చెప్పాడని వివరించారు. తాము కలిసి బతకలేమని, ఒకరినొకరు విడిచి ఉండలేమనీ భావించిన వారిద్దరూ.. కలిసే చనిపోవాలని అంతకుముందే నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. ఈ కేసుపై ఇంకా దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని