POCSO: పైశాచికం..చెట్టుకు కట్టేసి..బలవంతంగా మూత్రం తాగించి!
రాజస్థాన్ (Rajasthan)లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రాత్రి పూట బాలికను కలవాలని వచ్చాడన్న కారణంతో ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. బలవంతంగా మూత్రం(Urine) తాగించారు.
జోద్‌పూర్: బాలికను కలిసేందుకు రాత్రి పూట పక్క ఊరి నుంచి వచ్చాడన్న కారణంతో ఓ యువకుడిని అర్ధనగ్నంగా (half nake) చెట్టుకు కట్టేసి చావబాదారు. అక్కడితో ఆగకుండా బలవంతంగా మూత్రం తాగించారు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్ (Rajasthan)లోని జాలోర్ (Jalore)లో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాలికను కలిసేందుకు సమీప గ్రామం నుంచి ఓ యువకుడు ఆదివారం రాత్రి వచ్చాడు. అది గమనించిన బాలిక బంధువులు అతడిని బంధించి చెట్టుకు కట్టేశారు. వద్దని మొరపెట్టుకుంటున్నావినకుండా చర్మం చిట్లేలా కొట్టారు. అతడిపై మూత్రం పోశారు. అక్కడితో ఆగకుండా ఓ సీసాలో మూత్రం నింపి బలవంతంగా తాగించారు.
ఈలోగా విషయం తెలుసుకున్న బాధితుడి తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు.యువకుడిని విడిచిపెట్టాలని ఎంత ప్రాధేయపడినా వినలేదు. చివరికి గ్రామపెద్దలు కలగజేసుకొని ఇరువర్గాలవారినీ అక్కడి నుంచి పంపించేశారు. అయితే, ఘటనకు సంబంధించి తొలుత ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోమవారం నాటికి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుడి ఇంటికి వెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మరోవైపు బాలిక ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమె నుంచి వివరాలు సేకరించినట్లు చెప్పారు. బాధితుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!
-
Movies News
Ram gopal varma: ఆర్జీవీ నా ఫస్ట్ ఆస్కార్ అన్న కీరవాణి.. వర్మ రిప్లై ఏంటో తెలుసా?
-
Politics News
Rahul Gandhi: ‘వాజ్‌పేయీ మాటలను గుర్తుతెచ్చుకోండి’.. అనర్హత వేటుపై ప్రశాంత్ కిశోర్!
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
World News
TikTok: టిక్‌టాక్ బ్యాన్‌తో నాకూ లాభమే: జస్టిన్ ట్రూడో