Road Accident: టూరిస్ట్‌ బస్సు బోల్తా: 22 మందికి గాయాలు

డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా బస్సు బోల్తా పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దతామరాపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.

Updated : 20 Jun 2022 08:16 IST

నందిగాం: డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా బస్సు బోల్తా పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దతామరాపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పశ్చిమబెంగాల్‌కు చెందిన పలువురు విహారయాత్ర కోసం టూరిస్ట్ బస్సులో కేరళకు బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దతామరాపల్లి సమీపంలోకి రాగానే డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకుని.. జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టును ఢీ కొట్టాడు. దీంతో బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. 

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్‌తోసహా 39 మంది ఉన్నారు. వీరిలో 22మందికి గాయాలవ్వగా వారిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. నందిగాం ఎస్సై మహ్మద్‌ యాసిన్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు