TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. సిట్‌ నివేదికలో కీలక అంశాలు

ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో ప్రాథమిక నివేదికను సిట్‌ అధికారులు టీఎస్‌పీఎస్సీకి అందజేశారు.ఈ కేసులో కీలక సూత్రధారి ప్రవీణ్‌తో సిస్టం అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌ చేతులు కలిపాడని నివేదికలో పేర్కొన్నారు.

Updated : 17 Mar 2023 21:29 IST

హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో ప్రాథమిక నివేదికను సిట్‌ అధికారులు టీఎస్‌పీఎస్సీకి అందజేశారు. సిట్‌ నివేదికలో అధికారులు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ నివేదిక అధారంగానే టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన నాలుగు పరీక్షలను రద్దు చేసింది. ‘‘పేపర్‌ లీక్‌లో కీలక సూత్రధారి ప్రవీణ్‌తో సిస్టం అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌ చేతులు కలిపాడు. ఉద్దేశపూర్వకంగానే టీఎస్‌పీఎస్సీకి వచ్చిన రాజశేఖర్ ఏడేళ్లుగా పొరుగు సేవల ఉద్యోగిగా పనిచేస్తున్నారు. పథకం ప్రకారమే ప్రవీణ్‌తో సంబంధాలు కొనసాగించాడు. కంప్యూటర్‌ను హ్యాక్‌ చేసి పాస్‌వర్డ్‌ దొంగిలించింది రాజశేఖరే.

శంకరలక్ష్మి తన డైరీలో రాసుకున్న పాస్‌వర్డ్‌ను తస్కరించి కంప్యూటర్‌లో చొరబడినట్టు ప్రవీణ్‌ చెబుతున్నాడు.. కానీ, పాస్‌వర్డ్‌ని తాను ఎక్కడా రాయలేదని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ అధికారిణి వరలక్ష్మి స్పష్టం చేశారు. పెన్‌ డ్రైవ్‌ ద్వారా 5 పరీక్షా పత్రాలను రాజశేఖర్‌ కాపీ చేశాడు. కాపీ చేసిన పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇవ్వగా.. అతను ఏఈ ప్రశ్నపత్రాన్ని రేణుకకు విక్రయించాడు. గ్రూప్‌-1 ప్రశ్నపత్రం కూడా లీకైనట్టు గుర్తించాం. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపై కూడా దర్యాప్తు చేస్తున్నాం. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి దగ్గర పీఏగా ప్రవీణ్ ఏడాదిన్నరగా పనిచేస్తున్నాడు’’ అని సిట్‌ అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని