నదిలో పడిన ట్రక్కు.. ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐరన్‌ లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి నదిలో పడిపోవడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనల బేతుల్‌ జిల్లాలోని సోప్నా పట్టణ సమీపంలో తావా నదిపై మంగళవారం చోటుచేసుకుంది.

Published : 18 Nov 2020 01:01 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐరన్‌ లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి నదిలో పడిపోవడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన బేతుల్‌ జిల్లాలోని సోప్నా పట్టణ సమీపంలో తావా నదిపై మంగళవారం చోటుచేసుకుంది. చొప్నా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జి రాహుల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బేతుల్‌ జిల్లాలో ఐరన్‌ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ప్రమాదవశాత్తు తావా నది వంతెనపై నుంచి కిందపడిపోయింది. దీంతో ట్రక్కు డ్రైవర్‌ సహా, ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. మరణించిన వారిని రికేష్‌(25), బబ్లు భలావీ(24), దిలీప్‌(26), సంజు బత్కే(40), మున్నా సలాం(24), డ్రైవర్‌ మనోహర్‌(38)లుగా  గుర్తించినట్లు వెల్లడించారు. కూలీలంతా పిప్రి గ్రామానికి చెందిన వారుగా గుర్తించినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాల్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్‌ అధికారి రాహుల్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని