Andhra News: తండ్రికి కర్మకాండలు నిర్వహించేందుకు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
వంశధార నదిలో గల్లంతై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని గొట్టా బ్యారేజీ వద్ద చోటుచేసుకుంది.
హిరమండలం: వంశధార నదిలో గల్లంతై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని గొట్టా బ్యారేజీ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిరమండలంలోని శుభలయ్య ఆర్‌ఆర్ కాలనీకి చెందిన దుబ్బారపు లలిత్ సాగర్ (30) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆయన తండ్రి, ఆర్‌ఎంపీ వైద్యుడు సూర్యారావు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తండ్రి కర్మకాండలు నిర్వహించేందుకు వచ్చిన లలిత్ సాగర్.. గొట్టా బ్యారేజీ వద్ద స్నానం చేస్తూ నదిలో గల్లంతై మృతిచెందారు.
ఆ సమయంలో బ్యారేజీ వద్ద ఉన్న మత్స్యకారులు ఆయనను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానిక గజ ఈతగాళ్లతో లలిత్ సాగర్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతోపాటు 9 నెలల చిన్నారి ఉన్నారు. వారం రోజుల వ్యవధిలో తండ్రీకుమారుడు మృతిచెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్కు మరో రెండు పతకాలు.. ఫైనల్కు కిదాంబి శ్రీకాంత్