
CCTV: వేట కుక్కలుగా మారిన వీధి శునకాలు.. మహిళపై దాడి
కొయ్కోడ్: వీధి శునకాలు వేట కుక్కలుగా మారి, ఓ మహిళను అతి దారుణంగా గాయపరిచిన ఘటన కేరళలో జరిగింది. కొయ్కోడ్లోని తామర్సి ప్రాంతానికి చెందిన మహిళ పని మీద బయటకు వచ్చింది. అటుగా వచ్చిన వీధి శునకాలు ఆమెను చుట్టు ముట్టాయి. వాటిని తరిమేందుకు ప్రయత్నించగా ముందుకు వెళ్లినట్లే వెళ్లి వెనక్కి వచ్చి దాడి చేశాయి. కింద పడిపోయిన ఆమెను కరుస్తూ తీవ్రంగా గాయపరిచాయి. బాధితురాలి కేకలతో అప్రమత్తమైన స్థానికులు శునకాలను తరిమేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా కూడా కూడా అవి వెనక్కి తగ్గలేదు. చాలా సేపటి వరకూ శునకాలతో మహిళ పోరాడింది. దాడి దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.