AP News: కడపలో హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

కడపలో హెడ్‌కానిస్టేబుల్‌ విజయ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని పోలీస్‌ కంట్రోల్‌ రూంలో ఉరేసుకుని..

Updated : 21 Jul 2021 11:00 IST

కడప నేరవార్తలు: కడప జిల్లా కోర్టు ఆవరణలోని పోలీస్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ విజయ్‌కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మంగళవారం రాత్రి పోలీస్ కంట్రోల్ కార్యాలయానికి విధుల నిమిత్తం వచ్చారు. ఇవాళ ఉదయం కోర్టు సిబ్బంది చూసేసరికి విజయ కుమార్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. వెంటనే విషయాన్ని ఒకటో పట్టణ పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గత కొంత కాలంగా విజయ్‌కుమార్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని