Ap News: పంచ్‌ ప్రభాకర్‌ అరెస్టుకు వారెంట్‌ తీసుకున్నాం: సీబీఐ

జడ్జిలపై  సోషల్‌ మీడియాలో  అసభ్య పోస్టుల కేసులో  అఫిడవిట్‌ను సీబీఐ పిటిషనర్లకు పంపింది. ఇప్పటికే దీనిపై హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.  ఈ కేసులో పంచ్‌ ప్రభాకర్‌పై

Updated : 25 Nov 2021 20:01 IST

అమరావతి: జడ్జిలపై  సోషల్‌ మీడియాలో  అసభ్య పోస్టుల కేసులో  అఫిడవిట్‌ను సీబీఐ పిటిషనర్లకు పంపింది. ఇప్పటికే దీనిపై హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.  ఈ కేసులో పంచ్‌ ప్రభాకర్‌పై  నవంబరు 1న లుకౌట్‌ నోటీసులు జారీ చేశామని సీబీఐ తెలిపింది.  పంచ్‌ ప్రభాకర్‌ అరెస్టుకు నవంబరు 8న వారెంట్‌ తీసుకున్నామని పేర్కొంది. ప్రభాకర్‌ అరెస్టుకు సహకరించాలని  ఈ నెల 9న ఇంటర్‌ పోల్‌కు  విజ్ఞప్తి చేసినట్లు అఫిడవిట్‌లో వెల్లడించింది. ఈ అంశంపై ఇంటర్‌పోల్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. జడ్జిలపై పోస్టులు తొలగించడంపై  ఈ నెల 15న యూట్యూబ్‌ ప్రతినిధులతో మాట్లాడినట్లు తెలిపింది. ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ విచారిస్తున్నామన్న సీబీఐ ... ఈ కేసులో పంచ్‌  ప్రభాకర్‌ను 17వ నిందితుడిగా చేర్చినట్లు పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని