Road Accident: లారీని ఢీకొన్న కారు.. మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి!

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలఘాట్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ నంబరు జాతీయ రహదారిపై గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని...

Updated : 25 Aug 2021 11:42 IST

కోహిర్‌: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలఘాట్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ నంబరు జాతీయ రహదారిపై గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అవడంతో యువతి మృతదేహం శకలాల్లో ఇరుక్కుపోయింది. బాధితులను హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన స్నేహితులుగా పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన యువతి నిహారిక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రేన్ సాయంతో కారును పక్కకు తప్పించి ఆ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని