
Crime News: విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి
విశాఖపట్నం: విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి కలకలం రేపింది. మాట్లాడేందుకు యువతిని లాడ్జికి తీసుకెళ్లిన యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రేమకు నిరాకరించిందని ఆగ్రహంతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. అనంతరం యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. గాయపడిన యువతి, యువకుడిని విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి, యవకుడు పంజాబ్‌లో బీటెక్ చదివినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన యువకుడు వరంగల్ వాసిగా పోలీసులు గుర్తించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.