లారీ బోల్తా ఘటనలో ముగ్గురు అరెస్టు

శంషాబాద్‌ లారీ ప్రమాద ఘటనకు కారణమైన ముగ్గురు అరెస్టు అయ్యారు. మాదాపూర్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గిరి, హోంగార్డు సంగమేశ్వర్‌, స్నేహితుడు

Updated : 20 Apr 2021 11:30 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ లారీ ప్రమాద ఘటనకు కారణమైన ముగ్గురు అరెస్టు అయ్యారు. మాదాపూర్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గిరి, హోంగార్డు సంగమేశ్వర్‌, స్నేహితుడు మల్లేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. 304 పార్ట్‌ 2 సెక్షన్ల కింద  కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం వీరిని జైలుకు తరలించనున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌లో హోంగార్డ్‌ సంగమేశ్వర్‌కు 150, మల్లేష్‌కు 103 రీడింగ్‌ చూపించింది. కారు నడిపిన గిరి రక్తనమూనాలను పోలీసులు పరీక్షకు పంపారు. 

శంషాబాద్‌ వద్ద ఆదివారం వేగంగా వచ్చిన కారు ఇటుక లారీ కిందకు దూసుకెళ్లడంతో అది బోల్తా పడింది. దీంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు కార్మికులు మృతి చెందారు. అనంతరం ఆసుపత్రిలో మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. సోమవారం మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఇప్పటివరకు ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరో 19 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతిచెందిన వారంతా ఒడిశాకు చెందిన కార్మికులు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని