Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్‌

Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడను పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీ ఛానళ్లలో అవకాశాల పేరుతో ఓ బాలికను భార్గవ్‌ మోసం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో

Published : 21 Apr 2021 01:39 IST

విశాఖ: Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడను పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీ ఛానళ్లలో అవకాశాల పేరుతో ఓ బాలికను భార్గవ్‌ మోసం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈనెల 16న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు.. విచారణ చేపట్టి హైదరాబాద్‌లో భార్గవ్‌ను అరెస్ట్‌ చేశారు. అతడిపై పోక్సో, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నిన్న కోర్టులో హాజరుపరిచామని.. మే 3వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు. భార్గవ్‌ చిప్పాడ విజయనగరం జిల్లా వాసి అని దిశ ఏసీపీ ప్రేమ్‌ కాజల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని