Ts News: పెళ్లిలో హిజ్రాల హల్‌చల్‌

సికింద్రాబాద్‌ పరిధిలోని నేరెడ్‌మెట్‌లోని ఓ పెళ్లిలో హిజ్రాలు హల్‌చల్‌ చేశారు. పెళ్లి వారింటికి వెళ్లి రూ. 50వేలు డిమాండ్‌ చేశారు. వారు డబ్బులు

Published : 18 Jun 2021 01:32 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరిధిలోని నేరెడ్‌మెట్‌లోని ఓ పెళ్లిలో హిజ్రాలు హల్‌చల్‌ చేశారు. పెళ్లి వారింటికి వెళ్లి రూ. 50వేలు డిమాండ్‌ చేశారు. వారు డబ్బులు ఇవ్వకపోవడంతో దుస్తులు విప్పి హంగామా చేశారు. అంతటితో ఆగకుండా శుభకార్యానికి వచ్చిన బంధువులపై దాడికి పాల్పడ్డారు. బాధితులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న నేరెడ్‌మెట్‌ పోలీసులు హిజ్రాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా దుస్తులు విప్పి పోలీసులపై వారి ప్రతాపం చూపించారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు హిజ్రాలపై 506, 448 సెక్షన్లు, 188, 51(b) విపత్తు నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని