Dead body in freezer: 22 రోజులుగా ఫ్రిజ్‌లోనే మృతదేహం

కుమారుడి మృతదేహాన్ని ఓ తండ్రి 22 రోజులపాటు ఫ్రిజ్‌లోనే ఉంచడం కలకలం రేపింది. తన కుమారుడి మృతి పట్ల అనుమానాలున్నాయని, నిజాలు బయటపడేవరకు.....

Published : 25 Aug 2021 01:23 IST

సుల్తాన్‌పుర్‌: కుమారుడి మృతదేహాన్ని ఓ తండ్రి 22 రోజులపాటు ఫ్రిజ్‌లోనే ఉంచడం కలకలం రేపింది. తన కుమారుడి మృతి పట్ల అనుమానాలున్నాయని, నిజాలు బయటపడేవరకు అతడికి అంత్యక్రియలు నిర్వహించబోమని ఆ తండ్రి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌ జిల్లా మజావున్‌ గ్రామానికి చెందిన శివాంక్‌(32) 2012 నుంచి దిల్లీలోని ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్నాడు. అక్కడే అతడికి గుర్లీన్‌ కౌర్‌ అనే యువతి పరిచయం కావడంతో 2013లో వారు వివాహం చేసుకున్నారు.

అయితే ఈ నెల 1వ తేదీన శివాంగ్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని అతడి తండ్రి శివ్‌ప్రతాప్‌ పాఠక్‌కు అప్పగించారు. కుమారుడి శవాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చిన పాఠక్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు. కొడుకు మృతిపై అనుమానాలున్నాయని, ఆస్తి కోసం కోడలే హత్య చేసి ఉంటుందని ఆరోపించారు. నిజాలు బయటపడేవరకు దహన సంస్కారాలు నిర్వహించబోనని శవాన్ని ఇంట్లోని డీప్‌ ఫ్రిజ్‌లో భద్రపరిచాడు.

ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ సోమవారం పోలీసు యంత్రాంగంతో చర్చలు జరిపారు. అనంతరం శివాంక్‌ మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా ప్రధాన మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన డాక్టర్ల బృందం మంగళవారం ఆ శవానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ నివేదిక రావాల్సిఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని