Andhra News: అందుకే డ్రగ్స్‌ సరఫరాకు విజయవాడను ఎంచుకున్నారు: డీసీపీ

విజయవాడ డ్రగ్‌ ప్యాకెట్‌ కొరియర్‌ ఘటనకు సంబంధించి పోలీసులు చెన్నైకి చెందిన అరుణాచలం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Updated : 11 May 2022 11:52 IST

విజయవాడ: విజయవాడ డ్రగ్స్‌ ప్యాకెట్‌ కొరియర్‌ ఘటనకు సంబంధించి పోలీసులు చెన్నైకి చెందిన అరుణాచలం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నగరం నుంచి కొరియర్‌ ద్వారా ఆస్ట్రేలియాకు ఎఫిడ్రిన్‌ అనే డ్రగ్‌ను పంపిన ఘటనకు సంబంధించి నిందితులను ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టిన డీసీపీ మేరీ ప్రశాంతి.. వివరాలను వెల్లడించారు. విజయవాడ నుంచి కొరియర్‌ చేసిన అరుణాచలాన్ని చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. రూ.45లక్షల విలువైన స్మగుల్డ్‌ గూడ్స్‌ రవాణా చేస్తూ దొరికినట్లు వివరించారు. చెన్నై బర్మా బజారులో అరుణాచలం పని చేస్తాడని డీసీపీ చెప్పారు. నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

‘‘జాగ్రత్తలు తీసుకోవాలని కొరియర్‌ సంస్థలను హెచ్చరిస్తున్నాం. గోపి సాయి ఆధార్‌ ఫోర్జరీ చేసి అరుణాచలం ఉపయోగించాడు. ఆధార్ ఫోర్జరీపై విజయవాడ పోలీసులకు గోపి సాయి ఫిర్యాదు చేశాడు. నిందితుడు అరుణాచలాన్ని ఫోర్జరీ కేసులో అరెస్ట్‌ చేశాం. డ్రగ్స్‌ కేసు మొత్తాన్ని బెంగళూరు కస్టమ్స్‌ అధికారులు విచారణ చేస్తున్నారు. చెన్నై నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి విజయవాడ నుంచి కొరియర్‌ ద్వారా సప్లై చేశారు. విజయవాడ నుంచి కొరియర్‌ ద్వారా మాత్రమే పంపారు. మరో ఇద్దరి పాత్రపైనా విచారణ చేస్తున్నాం. విదేశాలకు విజయవాడ నుంచి కొరియర్‌ చేసే కార్యాలయాలపై ఇకపై తనిఖీలు చేస్తాం. చెన్నై నుంచి కొరియర్‌ చేస్తే తెలిసిపోతుందని విజయవాడను ఎంచుకున్నారు’’ అని డీసీపీ మేరీ ప్రశాంతి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని