Crime News: నెల క్రితమే పెళ్లి.. బ్లేడ్‌తో భర్త గొంతుకోసిన భార్య

హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో దారుణం చోటుచేసుకుంది. భార్య బ్లేడుతో భర్త గొంతు కోసింది. భర్తకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పసరగొండ

Updated : 25 Apr 2022 16:48 IST

దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో దారుణం చోటుచేసుకుంది. భార్య బ్లేడుతో భర్త గొంతు కోసింది. భర్తకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పసరగొండ గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజు, అర్చనకు గత నెల 25న వివాహమైంది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అర్చన బ్లేడ్‌తో తన భర్త రాజు గొంతు కోసింది. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు 108 ద్వారా వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అర్చన గత కొన్ని రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలానికి దామెర పోలీసులు చేరుకుని పరిశీలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని