Crime News: భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భార్య

అన్నమయ్య జిల్లా కురబలకోటలో దారుణం జరిగింది. పూజారివాండ్లపల్లెలో ఆర్మీ మాజీ ఉద్యోగిపై ఆయన భార్య పెట్రోల్‌ పోసి నిప్పంటించింది.

Updated : 07 Jun 2023 11:51 IST

కురబలకోట: అన్నమయ్య జిల్లా కురబలకోటలో దారుణం జరిగింది. పూజారివాండ్లపల్లెలో ఆర్మీ మాజీ ఉద్యోగిపై ఆయన భార్య పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. భర్త శ్రీధర్‌ నిద్రిస్తుండగా.. అతడిపై భార్య మమత పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టింది. గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు మంటలార్పి.. శ్రీధర్‌ను బెంగళూరుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆయన మృతిచెందాడు. ఈ ఘటనపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని