కూలిన మూడంతస్తుల భవనం..10 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో కనీసం ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన భీవండిలోని పటేల్‌ కాంపౌండ్‌ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.............

Updated : 21 Sep 2020 14:39 IST

ముంబయి: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో కనీసం 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన భీవండిలోని పటేల్‌ కాంపౌండ్‌ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 3.40 సమయంలో జరిగింది. మరో 10 మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు థానె మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఓ 25 మందిని స్థానికులు కాపాడారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అందరూ నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. భవనం పురాతమైనది కావడం వల్లే ఇటీవల కురుస్తున్న వర్షాల ధాటికి కుప్పకూలినట్లు ప్రాథమిక అంచనా వచ్చారు. అయితే, జిలానీ భవన్‌గా పిలిచే ఈ నివాసం కూల్చివేయాల్సిన భవనాల జాబితాలో ఉందో.. లేదో.. తెలుసుకొని సరైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని