logo

తల్లి జ్ఞాపకార్థం ఆలయం నిర్మించిన తనయుడు

సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు బాసర వరకు వెళ్లాల్సి వస్తోందని.. స్థానికంగా నిర్మిస్తే చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించవచ్చుననే ఆలోచనతో తన తల్లి మల్లేశ్వరి జ్ఞాపకార్థం కటుకూరి వెంకటేష్‌ క్యాతనపల్లి పుర పరిధిలోని ఏజోన్‌ శ్రీ కోదండ రామాలయంలో సరస్వతి దేవి ఆలయాన్నే నిర్మించాడు.

Published : 27 Jan 2023 05:45 IST

ఆలయంలో ప్రతిష్ఠించిన సరస్వతిదేవి ప్రతిమ, పూజలో పాల్గొన్న కుటుంబసభ్యులు

రామకృష్ణాపూర్‌, న్యూస్‌టుడే: సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు బాసర వరకు వెళ్లాల్సి వస్తోందని.. స్థానికంగా నిర్మిస్తే చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించవచ్చుననే ఆలోచనతో తన తల్లి మల్లేశ్వరి జ్ఞాపకార్థం కటుకూరి వెంకటేష్‌ క్యాతనపల్లి పుర పరిధిలోని ఏజోన్‌ శ్రీ కోదండ రామాలయంలో సరస్వతి దేవి ఆలయాన్నే నిర్మించాడు. వసంత పంచమిని పురస్కరించుకొని గురువారం నూతనంగా నిర్మించిన ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోత్సవాల నడుమ ధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. కటుకూరి వెంకటేష్‌-వనస్వీ దంపతులు, వారి కుటుంబసభ్యుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్యహించారు. రూ.25 లక్షలతో ఏడు నెలల వ్యవధిలో ఈ ఆలయాన్ని పూర్తి చేశారు. వేద పండితులు ప్రదీప్‌, ఆలయ అర్చకులు అంబ ప్రసాద్‌, చక్రవర్తి, కౌన్సిలర్‌ జాడి శ్రీనివాస్‌, కోఆప్షన్‌ సభ్యుడు సుదర్శన్‌గౌడ్‌, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని