logo

వెల్లువెత్తిన నామినేషన్లు

లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్‌ అధికారి ముజమ్మిల్‌ఖాన్‌ నామపత్రాలు స్వీకరించారు.

Published : 26 Apr 2024 02:49 IST

63 మంది అభ్యర్థుల నామపత్రాలు దాఖలు

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్‌ అధికారి ముజమ్మిల్‌ఖాన్‌ నామపత్రాలు స్వీకరించారు. చివరి రోజైన గురువారం నామినేషన్లు వెల్లువెత్తాయి. ఒకే రోజు 22 మంది నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి ముజమ్మిల్‌ఖాన్‌కు అందించారు. భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌, ఎస్‌. కుమార్‌లు వేర్వేరుగా నామపత్రాలు దాఖలు చేశారు. భారాస తరుఫున జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధూకర్‌, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లు నామపత్రాలు దాఖలు చేశారు.

ఒకే రోజు 22 మంది

చివరి రోజు ప్రధాన పార్టీలు భాజపా, భారాసతో పాటు అత్యధికంగా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన వారిలో ఉన్నారు. ఒకే రోజు 22 మంది అభ్యర్థులు 54 నామపత్రాలను సమర్పించారు. ఇప్పటి వరకు మొత్తం 63 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం పరిశీలన కార్యక్రమం నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని