logo

వివాహితపై హెడ్‌కానిస్టేబుల్‌ లైంగిక వేధింపులు

శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్‌ కానిస్టేబుల్‌ మావల పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది.

Published : 26 Apr 2024 03:01 IST

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే: శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్‌ కానిస్టేబుల్‌ మావల పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. డీఎస్పీ జీవన్‌రెడ్డి, మావల ఎస్‌ఐ వంగ విష్ణువర్ధన్‌ వివరాల ప్రకారం.. కాలనీలో నివాసం ఉంటున్న వివాహిత ఇంటి సమీపంలోనే యాపల్‌గూడ బెటాలియన్‌లో విధులు నిర్వహించే హెడ్‌కానిస్టేబుల్‌ ఎడిపెల్లి గణేష్‌ ఉంటున్నాడు. తెల్లవారుజామున ఆమె ఇంటికి వెళ్లి తలుపు గడియ కొట్టాడు. లోనికి వెళ్లి లైంగికంగా వేధించాడు. ఆమె కేకలు వేయటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత మహిళ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు ఎఫ్‌ఐఆర్‌ను బెటాలియన్‌ కమాండెంట్కు అందజేస్తామని ఎస్‌ఐ తెలిపారు.


అపాô్్టమెంట్లో హుండీ చోరీ

మైనర్ల పనేనని అనుమానాలు

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని రవీంద్రనగర్‌లోని ఓంసాయి రెసిడెన్స్‌ అపార్ట్‌మెంట్లో గురువారం తెల్లవారుజామున మైనర్లుగా భావిస్తున్న నలుగురు చోరీకి పాల్పడ్డ సంఘటన వెలుగు చూసింది. అపార్ట్‌మెంట్వాసులు కింద ఏర్పాటు చేసుకున్న గణపతి గుడిలోని చిన్న హుండీని ఎత్తుకెళ్లారు. మొదట ద్విచక్రవాహనాలను చోరీ చేయటానికి యత్నించి సాధ్యం కాక హుండీని ఎత్తుకెళ్లారు. భుక్తాపూర్‌ కాలనీలోనూ ఒక ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసే క్రమంలో రోడ్డుపై వరకు తీసుకొచ్చి వదిలేశారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. రవీంద్రనగర్‌ అపార్ట్‌మెంట్ వాసులు వన్‌టౌన్‌ పోలీసులకు చోరీ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు