logo

ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి

గోడం నగేష్‌ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, మాజీ ఎంపీ రమేష్‌ రాఠోడ్‌, యువ నాయకుడు రితీష్‌ రాఠోడ్‌లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్‌ఘడ్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 26 Apr 2024 02:58 IST

ఓటు వేయాలని అభ్యర్థిస్తున్న ఎంపీ అభ్యర్థి నగేష్‌, ఎమ్మెల్యే శంకర్‌

ఉట్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే : గోడం నగేష్‌ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, మాజీ ఎంపీ రమేష్‌ రాఠోడ్‌, యువ నాయకుడు రితీష్‌ రాఠోడ్‌లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్‌ఘడ్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్‌, కార్యదర్శి రమేష్‌, మండలాధ్యక్షుడు రాజశేఖర్‌, నందిరెడ్డి, లింగాగౌడ్‌, రాజు, రాజేశ్వర్‌, తులసీరాం, మాణిక్‌రావు, కిరణ్‌, రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.

బోథ్‌: బోథ్‌లో గురువారం భాజపా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భాజపా అభ్యర్థి గోడం నగేష్‌కు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. నాయకులు వెంకటేష్‌, గంగయ్య, రోహిత్‌, సాయికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని