logo

రిమ్స్‌ సంచాలకుడిని బ్లాక్‌మెయిల్‌ చేసే యత్నం

తాను స్పెషల్‌ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్‌ సంచాలకుడు రాఠోడ్‌ జైసింÞ్ను, గజానంద్‌ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్‌ నుగుర్‌వార్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్‌ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు.

Published : 26 Apr 2024 03:02 IST

గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే : తాను స్పెషల్‌ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్‌ సంచాలకుడు రాఠోడ్‌ జైసింÞ్ను, గజానంద్‌ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్‌ నుగుర్‌వార్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్‌ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. సీఐ అశోక్‌ వివరాల ప్రకారం.. ఈ నెల 20న సదరు వ్యక్తి రిమ్స్‌ సంచాలకుడు రాఠోడ్‌ జైసింగ్‌ వద్దకు వెళ్లి మీ కళాశాల విద్యార్థులు గంజాయి తాగుతున్నారని, వారి వివరాలను మీరు కారు తీసుకొని బయటకు వస్తే చెబుతానని అన్నాడు. ప్రస్తుతం డ్రైవర్‌ లేడని, తరువాత వస్తానని ఆయన చెప్పటంతో తాను సాయంత్రం అయిదు గంటలకు వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అదే రోజు గజానంద్‌ ఆసుపత్రికి వెళ్లి వైద్యుడు అభిజిత్‌ నుగుర్‌వార్‌ను కలుసుకొని మీరు మహిళా వైద్యులతో మాట్లాడుతున్న వీడియోలు ఉన్నాయని, కారు తీసుకొని బయటకు వస్తే చూపిస్తానని చెప్పటంతో ప్రస్తుతం కారు అందుబాటులో లేదని వైద్యుడు తెలిపాడు. అక్కడి నుంచి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. ఈ విషయమై గురువారం వారు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆ వ్యక్తి కోసం పోలీసులు పలు చోట్ల సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని