logo

కాంగ్రెస్‌తోనే పేదలకు భవిష్యత్తు

కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్‌, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్‌నగర్‌లో రోడ్‌ షోలో పాల్గొన్నారు.

Published : 26 Apr 2024 02:58 IST

బొక్కలగూడలో రోడ్‌ షోలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి సుగుణ

ఆదిలాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్‌, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్‌నగర్‌లో రోడ్‌ షోలో పాల్గొన్నారు. డీసీసీబీ ఛైర్మన్‌ భోజారెడ్డి, పుర ఉపాధ్యక్షుడు జహీర్‌ రంజానీ, గంగారెడ్డి, ఎంఏ షకీల్‌, ఖయ్యుం తదితరులు పాల్గొన్నారు.

బజార్‌హత్నూర్‌: కాంగ్రెస్‌ పార్టీ విచార్‌ విభాగ్‌ తెలంగాణ కోఆర్డినేటర్‌ తుల అరుణ్‌ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు.  

తలమడుగు: జడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని ఉండం, నడింపల్లి, కడపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కన్వీనర్‌ రాజేశ్వర్‌, జడ్పీటీసీ మాజీ సభ్యుడు బాబన్న, సీనియర్‌ నేతలు ప్రకాశ్‌రావు, వెంకన్నయాదవ్‌, రఫీక్‌, అశోక్‌, పోతన్న, లోక ప్రవీణ్‌రెడ్డి, సాంబశివ్‌, పోశెట్టి, మోహన్‌, గంగన్న, రాకేశ్‌, సాయికిరణ్‌, వంశీ, గణేశ్‌, సుభాశ్‌, విలాస్‌యాదవ్‌, నగేశ్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

బోథ్‌: బోథ్‌ మండలం పొచ్చర, కన్గుట్ట, కౌఠ, కుచులాపూర్‌, పిప్పల్‌దరి గ్రామాలలో గురువారం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అశ్విన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఏఐసీసీ విచార్‌ విభాగ్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ తుల అరుణ్‌కుమార్‌ టివిటి, కోఠ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యుడు మహేందర్‌, నాయకులు దౌలత్‌ రావు, ఆడె వసంత్‌, నాగేందర్‌, సత్యనారాయణ, నాగభూషణ్‌ రెడ్డి, మల్లేష్‌, శ్రీకాంత్‌ రెడ్డి, భోజన్న, రవి, అనూష్‌, బుచ్చా రెడ్డి, నగేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బోథ్‌: ఏఎంసీ ఛైర్మన్‌ గంగారెడ్డి బోథ్‌ మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు మహమ్మద్‌ ఆధ్వర్యంలో బూత్‌ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు.నాయకులు నాజర్‌ అహ్మద్‌, అబూద్‌, సాయన్న, నారాయణ, అబ్రార్‌, వినయ్‌ రెడ్డి, సురేందర్‌, దయాకర్‌, హసీబ్‌, రహీమోద్దీన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని