logo

వైభవంగా రమా సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం

కొత్త హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ రమా సత్యనారాయణ, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.

Published : 28 Mar 2024 14:41 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: కొత్త హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ రమా సత్యనారాయణ, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ రమా సత్యనారాయణ కల్యాణోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు గోవింద నామ స్మరణలను పఠించారు.  అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ బాధ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని