‘ఇంటింటికి రేషన్ పంపిణీ నిలిపేస్తాం’
ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఏప్రిల్ 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ నిలిపివేయనున్నట్లు ఎండీయూ ఆపరేటర్ల మండలాధ్యక్షుడు మత్స్యకొండబాబు తెలిపారు.
జేసీకి వినతిపత్రం అందజేస్తున్న ఆపరేటర్లు
జి.మాడుగుల, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఏప్రిల్ 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ నిలిపివేయనున్నట్లు ఎండీయూ ఆపరేటర్ల మండలాధ్యక్షుడు మత్స్యకొండబాబు తెలిపారు. తమకు మార్చి నెల జీతం నిలిపివేశారన్నారు. గత నెల ఆయిల్ సొమ్ము, సహాయకుల జీతాలు అప్పులు చేసి చెల్లించామని చెప్పారు. వాహన ఇన్సూరెన్సు, ఈఎంఐ చెల్లించలేదని తమ వేతనాలు నిలిపివేయడం సరికాదని చెప్పారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వరపడాల్, సభ్యులు వీఎస్ చలం, పండన్న పాల్గొన్నారు.
డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: బీమా సాకుతో రెండు నెలలుగా నిలిపేసిన జీతాలు చెల్లించాలని కోరుతూ ఎండీయూలు జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాసుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. సంఘ జిల్లా అధ్యక్షుడు సునీల్ మాట్లాడుతూ రెండు నెలలుగా బ్యాంకు ఖాతాలో జీతాలు వేస్తున్నా, బరోడా బ్యాంకు యాజమాన్యం బీమా కట్టలేదనే సాకుతో జీతాల్లో కోత విధిస్తున్నారన్నారు.
రంపచోడవరం, న్యూస్‌టుడే: ఎండీయూ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే నెల 1 నుంచి విధులు బహిష్కరిస్తామని ఆ సంఘ నాయకులు సీహెచ్ రామకృష్ణ, కె.రామదాసు, శ్రీనివాసులు తదితరులు తెలిపారు. ఏజెన్సీవ్యాప్తంగా పనిచేస్తున్న ఎండీయూ ఆపరేటర్లు బుధవారం రంపచోడవరంలో డివిజనల్ పౌర సరఫరాల అధికారి శ్రీహరి, ఇన్‌ఛార్జి తహసీల్దారు పి.వెంకటేశ్వరరావుకు వినతిపత్రాలు అందజేశారు. వారు మాట్లాడుతూ రేషన్ వాహనాలకు ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వం కడతామని చెప్పిందని, అయితే తమ జీతాల నుంచి ప్రతినెల రికవరీ చేయడం దారుణమన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?
-
Politics News
TDP-Mahanadu: ‘బహిరంగ సభకు అడుగడుగునా అడ్డంకులే’
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Politics News
రూ.2కే కిలో బియ్యం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే: పేర్ని నాని