logo

పది పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖాధికారి సలీమ్‌ బాషా పేర్కొన్నారు. పది పరీక్షల ఏర్పాట్లు, కేంద్రాల కేటాయింపు, సదుపాయాలను గురువారం ఆయన ‘న్యూస్‌టుడే’కు వివరించారు.

Published : 31 Mar 2023 03:09 IST

ఫ్లయింగ్‌ స్క్వాడ్లతో నిఘా

పాడేరు, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖాధికారి సలీమ్‌ బాషా పేర్కొన్నారు. పది పరీక్షల ఏర్పాట్లు, కేంద్రాల కేటాయింపు, సదుపాయాలను గురువారం ఆయన ‘న్యూస్‌టుడే’కు వివరించారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 11,522 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పాడేరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 63 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ‘పాడేరు డివిజన్‌ పరిధిలో 39, రంపచోడవరం పరిధిలో 24 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. బాలురు 5,374 మంది, బాలికలు 6,148 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు కల్పించాం. నాడు-నేడు మొదటి దశ పనులు పూర్తయిన పాఠశాలల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల ప్రధానోపాధ్యాయులు చీఫ్‌ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తారు. గతానికి భిన్నంగా ఈసారి ఇన్విజిలేటర్లను జంబ్లింగ్‌ విధానంలో నియమిస్తున్నాం. ప్రతి మూడు రోజులకు ఇన్విజిలేటర్లు మారుతారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లుగా తహసీల్దార్లు, పోలీసు అధికారులను నియమిస్తున్నాం. చూసిరాతలకు తావు లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. నిఘా విభాగాలు, ఫ్లయింగ్‌ స్కాడ్‌లు నిరంతరం పర్యవేక్షణ చేస్తారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్ల పంపిణీ ప్రక్రియ పూర్తయింద’ని డీఈవో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని