logo

ఎండలతో పర్యటక ప్రాంతాలు వెలవెల

పర్యటక ప్రాంతం మారేడుమిల్లిలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. వారం రోజులుగా సుమారు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవడం గమనార్హం.

Published : 18 Apr 2024 01:58 IST

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: పర్యటక ప్రాంతం మారేడుమిల్లిలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. వారం రోజులుగా సుమారు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవడం గమనార్హం. బుధవారం 41 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సాధారణంగా మారేడుమిల్లిలో శీతల వాతావరణం నెలకొని ఉంటుంది. సముద్రమట్టం నుంచి చాలా ఎత్తులో ఉండటంతో ఇక్కడ చల్లగా ఉంటుంది. నిమ్మజాతి మొక్కలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. కాఫీ, రబ్బరు తోటలను విరివిగా గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. కొన్నేళ్లుగా అటవీ ప్రాంతాలు తగ్గిపోవడంతో వేసవి తాపం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే నిత్యం పర్యటకులతో రద్దీగా ఉండే మారేడుమిల్లి ప్రాంతం ప్రస్తుతం వెలవెలపోతుంది. కనీసం ఒక్క పర్యటకుడు కూడా రాకపోవడంతో దుకాణాల నిర్వాహకులు, కాటేజీలు, రిసార్టుల యజమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వన్యప్రాణులు ప్రధాన రహదారులపైకి వచ్చేస్తున్నాయి. ప్రధానంగా గొర్ర గేదెలు నీటి కోసం రహదారులపైకి రావడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: పాపికొండల పర్యటక ప్రాంతం పండగ రోజు వెలవెలబోయింది. పోచవరం లాంచీల రేవులో బుధవారం బోట్లు గట్టుకే పరిమితమయ్యాయి. ఒక్కపక్క పెరుగుతున్న ఎండలకు ఇప్పటికే పర్యటకులు తగ్గిపోయారు. ఇంటింటి కల్యాణంగా భావించే శ్రీరామనవమి రోజున ఒక్క పర్యటకుడు రాకపోవడంతో పోచవరం రేవు, పేరంటాళ్లపల్లి, పాపికొండల ప్రాంతంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు