logo

జానకి రాముల కల్యాణం.. జగమంతా సంబరం

మాడుగుల గవర వీధిలో కొలువైన వైభోగ సీతారాముల కల్యాణోత్సవం బుధవారం రాత్రి ఆలయం ప్రాంగణంలో కనులపండువగా జరిగింది.

Published : 18 Apr 2024 02:09 IST

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగుల గవర వీధిలో కొలువైన వైభోగ సీతారాముల కల్యాణోత్సవం బుధవారం రాత్రి ఆలయం ప్రాంగణంలో కనులపండువగా జరిగింది. సామూహికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వంద జంటలు పాల్గొన్నాయి.

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహగిరిపై గంగధార సమీపంలోని శ్రీసీతారామ స్వామి దేవాలయంలో బుధవారం సీతారామ కల్యాణం కనులపండువగా జరిగింది. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ నేతృత్వంలో అర్చకులు జానకి రాముల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ సీతారాముల పరిణయోత్సవాన్ని వేడుకగా జరిపించారు. ఈవో సింగల శ్రీనివాసమూర్తి దంపతులు దేవతామూర్తులకు పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సింహగిరిపై కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలోని సీతారాముల కల్యాణోత్సవం కూడా కమనీయంగా జరిగింది.


బియ్యం గింజలపై శ్రీరామ

మునగపాక: నాగులాపల్లిలో సీతారాముల కల్యాణానికి ఈ గ్రామానికి చెందిన కర్రి వాసు, యశోద దంపతులు బియ్యం గింజలపై శ్రీరామ అని పేరుతో కూడిన తలంబ్రాలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని