logo

నామినేషన్ల పర్వం నేటి నుంచి

సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది.

Published : 18 Apr 2024 02:23 IST

పాడేరు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో అరకులోయ, కలెక్టరేట్‌లోని జేసీ కార్యాలయంలో పాడేరు, రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో అరకు పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించేందుకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. పరిశీలన అనంతరం అధికారులు వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. వివిధ పార్టీల తరపున పోటీ చేయనున్న అభ్యర్థులు తమ నామినేషన్ల దాఖలుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి కిల్లు వెంకట రమేష్‌ నాయుడు ఈనెల 19వ తేదీన నామినేషన్‌ వేయనున్నారు. వైకాపా అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు అదే రోజు ఉదయం 11 గంటలకు నామినేషన్‌ వేస్తారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సతక బుల్లిబాబు 25వ తేదీన నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయ సునీత తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని