logo

వైకాపా సోషల్‌ మీడియా సమావేశంలో వాలంటీర్లు

ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్‌ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు.

Updated : 24 Apr 2024 04:50 IST

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్‌ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. వైకాపా ప్రచారాలు, సమావేశాల్లో దర్జాగా పాల్గొంటున్నారు. భీమిలి వద్ద మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ నిర్వహించిన సోషల్‌ మీడియా టీం సమావేశంలో ఎస్‌.రాయవరం మండలానికి చెందిన ఇద్దరు వాలంటీర్లు పాల్గొన్నారు. కొత్తరేవుపోలవరానికి చెందిన చేపల రాజు, ఉప్పరాపల్లికి చెందిన నానేపల్లి అప్పలరాజు సోషల్‌ మీడియా సమావేశానికి హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితం మండలంలోని వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించి, మళ్లీ వెనక్కి తగ్గారు. మండలంలో 420 మందికి పైగా వాలంటీర్లు ఉండగా, వారిలో కేవలం 18 మంది మాత్రమే ఇప్పటివరకు రాజీనామా చేసినట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు